మొన్న ఒక సారి నాకు కోపం వచ్చింది
తగ్గిన్నతరువాత జ్ఞానం వచ్చింది
అప్పుడు సిగ్గేసింది
జననం ,మరణం వెన్నంటొస్తే
తప్పదులేమరి ఎవ్వరికి
కోపం, తాపం విజృంభిస్తే
అందరు ఒకటే ఎప్పటికీ
అప్పుడె నిలబడు వాడంట
స్థిత ప్రజ్ఞుడై వెలుగంట
తుల్యం పరోపతాపిత్వం
క్రుధ్దయో: సాధునీచయో: |
న దాహే జ్వలతోర్భేద:
చందనేంధనయో: క్వచిత్ ||
సుత //