అమరావతి
అరవిరిసిన మొగ్గవలె అందాలను చిందింపగ
మనదను ఘన భావనతో అందరముపనిచేయగ
రాతిగుండెలన్నికూడ, చూసి , కళ్ళు తేలేయగ
వలదని తెగగోలపెట్టు వారలచే భేషనగ
తిరిగొచ్చెను అమరావతి గత వైభవ దీప్తులతో
కృష్ణా తీరమున ఆంధ్రా హృదయమున
సురులే భేషనేల వెలయును అమరావతి
చంద్రుని కనుసన్నలలో ఇంద్రుని మది మెచ్చేలా
మిలమిలమని మెరయునులె అమరమై అది
సు.త //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి