24, నవంబర్ 2016, గురువారం
21, నవంబర్ 2016, సోమవారం
చలి వైభోగం
చలి వైభోగం
చలి ,చెలి కలిసింది కార్తీకం మురిసింది
కటిక చీకటైన , దీప కాంతిలో మెరిసింది
గజగజ మని , చలి వణికిస్తే
బ్రహ్మ కూడా ముసుగేసే బ్రాహ్మీ ముహూర్తంలో
పడుతూ లేస్తూ , పడతులు
చన్నీటితో స్నానాలు, పలికేస్తూ మంత్రాలు
రమణులకు రాదారులు , దీపాలకు జలదారులు
అడుగిడితే శీతలం , అయినా జంకదు కోమలం
చలిదెబ్బకు జడిశాడు సూర్యుడు
అందుకే ఉదయమాలస్యం
ముసుగులో వణుకు చీకటిలో దడుపు
తీరా లేస్తే అంతా ఓ తపస్సు
ఉదయాన్నే దేవాలయాల్లో అభిషేకాలు
చక్కగా వినసొంపుగా వేదమంత్రాలు
చూసే వారికి , చేసే వారికి భక్తి సంబరం
ఇక చేయక పోతాడా పరమశివుడు ఆనందతాండవం
రోజంతా లక్ష పత్రి పూజలు
సాయంత్రం సంతర్పణ త్రేన్పులు
అందరం కలవడం ఆనందం
మరి భక్తి తో , అమందానందం
ఇక , ఏమని చెప్పను ఈ చలి వైభోగం
సుత //
20, నవంబర్ 2016, ఆదివారం
శివ
శివ
ఈ శ , మహేశ ,గిరీశ ,పరాత్పర శంభోశంకరా
హాలా హల ధర ,శూలా యుధకర , కరి చర్మాంభర ఈశ :
ముని ,గణ సేవిత ,మురహరి పూజిత ,గిరిజా శంకర
ఆశ్రిత రక్షక , అనాది శోభిత , అభిషేక ప్రియా ఈశ :
ఓంకార ధ్వని ,ఘీంకార ధ్వని ఓ నాదప్రియా
అద్భుత తాండవ , అఖండ శోభిత , ఓ పరమేశ్వర ఈశ :
ఆది అనాది , లేదు అనేది నీవేలే కదా
సగమై నీవు ప్రక్రుతి తోన మమేకమేకదా ఈశ :
సుత //
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)