కటిక చీకటైన , దీప కాంతిలో మెరిసింది గజగజ మని , చలి వణికిస్తే బ్రహ్మ కూడా ముసుగేసే బ్రాహ్మీ ముహూర్తంలో పడుతూ లేస్తూ , పడతులు చన్నీటితో స్నానాలు, పలికేస్తూ మంత్రాలు రమణులకు రాదారులు , దీపాలకు జలదారులు అడుగిడితే శీతలం , అయినా జంకదు కోమలం చలిదెబ్బకు జడిశాడు సూర్యుడు అందుకే ఉదయమాలస్యం ముసుగులో వణుకు చీకటిలో దడుపు తీరా లేస్తే అంతా ఓ తపస్సు ఉదయాన్నే దేవాలయాల్లో అభిషేకాలు చక్కగా వినసొంపుగా వేదమంత్రాలు చూసే వారికి , చేసే వారికి భక్తి సంబరం ఇక చేయక పోతాడా పరమశివుడు ఆనందతాండవం రోజంతా లక్ష పత్రి పూజలు సాయంత్రం సంతర్పణ త్రేన్పులు అందరం కలవడం ఆనందం మరి భక్తి తో , అమందానందం ఇక , ఏమని చెప్పను ఈ చలి వైభోగం
రిప్లయితొలగించండిఏమండోయ్ తనికెళ్ళ వారు,
ఇది నిజమే నంటా రా ? లేక మీ కలలో ని 'వై' భోగమా !
ఈ కాలం లో కళ్ళు నులుము కుని జూసినా బ్రాహ్మీ ముహూర్తం కాదు, పదిబారలు సూరీడు పైకొచ్చినా లేవని వాళ్ళే కనిపిస్తోంటేనూ :)
జిలేబి
nice one
రిప్లయితొలగించండి