ప్రమాదం - ప్రమోదం
నేడు ప్రమాదం , అయినా రేపు రోడ్లన్నీ ప్రమోదమే
చెప్తే వినరు ,మాకుతెలుసు అంటారు సమస్తం
బైక్ పై జామ్ అని లాగించేస్తే ఆ మజాయే వేరు అంటారు
నడుపుతూ సెల్ మాట్లాడుతూ ఉంటె ఆ స్టైలే వేరు అంటారు
మందుకొట్టి నడిపితేనా ఆ కిక్కె వేరు అంటారు
ఇక అమ్మాయిని కూర్చో పెట్టుకుని రాంగ్ రూట్లో లాగించేస్తుంటే
అబ్బబ్బబ్బబ్బా ........
ఇవన్నీ స్వర్గానికి బెత్తెడు ఎడానికి తీసికెళ్ళవూ
కనుకనే మరి , ఒక్క క్షణం చాలు దాన్ని చేరుకోవడానికి
బ్రహ్మగారు క్రితం జన్మ వ్యవహారాలన్నీ చూసి , లెక్కలు బేరీజు వేసి , బొమ్మకు శ్రీకారం చుడితే
తల్లి నవమాసాలు కడుపులో మోస్తే
తరువాత తల్లితండ్రులు కంటికి రెప్పలా కాపాడి ఇంత అయ్యేలా చేస్తే
ఒక్క క్షణం చాలా దాన్ని అంతం చేయడానికి
మరి ఆలోచించండి ఒకసారి
గుర్తుంచుకోండి ప్రతిసారి
సు.త //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి