సు కవి త
28, సెప్టెంబర్ 2015, సోమవారం
అమ్మాయి
అమ్మా
యి
కలుగు పుత్రుడంచు కలలు కనుచుoదురు
పుత్రి పుట్టెనంచు చింత ఏల
ఇంతియే
లేకున్న ఇజ్జగము ఉండునా
ఎరుగకా బ్రహ్మయ్య సృష్టి చేయ .
సు.త //
26, సెప్టెంబర్ 2015, శనివారం
దీనులు
దీనులు
ఎందెందు చూసినా కనిపించు దీనులు
మనసు యొప్పదుకదా వారి కివ్వగరూక
ఏదొ దొరుకునన్నఆశ తళుకుమన్న
యెంత పోయిన కూడ వగచమన్న
.
సు .త //
12, సెప్టెంబర్ 2015, శనివారం
తుఫాన్
తుఫాన్
ఇనుడు ఖిన్ను డయ్యె గుండమ్ము తో నేడు
కారు మేఘపు చెలియ దారి కాయ
పూరి గుడిసెల బాధ ఈవాన జడిలోన
లేచి రావేమయ్య కాంతివంత .
సు.త /
8, సెప్టెంబర్ 2015, మంగళవారం
తెలుగు న్యూస్
తెలుగు న్యూస్ భార్యా వియోగం
సతి పోయెను మతి పోయెను
కనుల, జలము సిరులాయెను
కాళ్ళకు అడ్డము బిడ్డలు, శవమే పూదండాయెను
జనుల మదిని, కరుణరసం పొంగిపొరలె, "చేదు",నిజం.
సు.త //
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)