కనకదుర్గమ్మ
ప : కొండను కొలువై వుందిరా
అదిగో మాతా శాంభవిరా
అండగ ఉండెదనందిర
భక్తుల పాలిటి అమ్మరా
మన శ్రీ కనకదుర్గమ్మరా కొండను:
1చ: సకలచరాచర మది చరిత
దుష్టులపాలిటి మృత్యులత
అగణిత గుణముల ప్రజ్వలత
శంకరి శుభకరి ఘనచరిత కొండను:
2చ : ఆశ్రితులను తన వారిగ ఎంచి
కొలచినకొలది కరుణించి
భక్తుల మొరలను ఆలించి
లోకాలను చల్లగ పాలించే కొండను:
3చ : విధాత తలపున విజ్ఞానం
శ్రీ హరి కే తరగని వైభోగం
పరమేశునిశక్తికె సగ భాగం
ఈ సృష్టికి అమ్మే కదమూలం కొండను: