ఓటు
కలోగంజో తాగి బతికే పేద బతుకులకెందుకోటు
కోట్లు తినుటకు ఓట్లు అడిగే బడాబాబుల నోట్లకేలే
నిరాశ ఆశలమధ్య నలిగే బడుగుజీవులకెందుకోటు
మధ్య మధ్యన మద్యమైనా దొరుకుతుందని ఆశతోనే
ఉన్నవారికి కోట్లు ఉండగ ,ఓట్లపీడ వారికెందుకు
బొక్కసంలో డబ్బులన్నీ పరులచేతికి చిక్కకుందుకు
విలువతెలియని వారి ఓటు రాజ్యమేలే మేటిసీటు
మేధావులంతా కాదుమనదనికళ్ళుమూసుకుఊరుకుంటే
ఊరకుక్కలు రాజులై, రారాజులై
రాజ్యమంతా మారిపోవును చిరిగి పోయిన విస్తరై
సు.త //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి