27, ఫిబ్రవరి 2015, శుక్రవారం
21, ఫిబ్రవరి 2015, శనివారం
తెలుగు
తొలి వెలుగు తొలిగి తెలుగు మలి వెలుగు చూడగోరే
ఇంగ్లీషు వెంట పరుగు ,తీస్తోంది తెలుగు పరువు
పొరిగింటి పుల్లకూర ,అయ్యింది భాషకూడ
దేశ భాషలందు లె స్సలాంటి తెలుగు
ఇంగ్లీషు తెగులుసోకి ,శో కించుతోంది ఇపుడు
మాత్రుభూమి కన్న మాత్రుబాషమిన్న
చెవులసోకగానే చిద్విలాసమన్న
హృద్యమైన పద్యం బలమున్నమేటి తెలుగు
ఒడలంత ఒంపులున్న సొగసైనసుందరన్న
ఏ భాషముందు కూడా తీసిపోదు తెలుగు
చెవులసోకగానే పులకించిపోవు ఒడలు
తెలుగు సోకగానే భారతమ్ము మెరిసె
తె లుగు తేనె తీపి పోతనయ్య తీసి
కృష్ణమూర్తి కధకు అద్దిచూపగానే
కర్ణామృత మాయె భాగవతం కూడా
అధినేతలంత కలసి అధికారులంత మెలసి
ప్రజలంత వంతపాడి సాగనంపుతోంటే
బ్రతుకుతుందచెప్పు బడాయికాకపోతే
మాత్రుభాషలోన ప్రతివాడు చదువుకుంటే
ఆ పైన దమ్ము ఉంటె ఇంగ్లీషు నేర్చు కుంటే
వెలుగుతుంది తెలుగు నలుదెసలచిమ్ముకుంటూ
బ్రతుకుతుంది తెలుగు భవితవుంది అంటూ
వినాయకుడు
వినాయకుడు
ప : తొలుతను నిన్ను కొలిచేమయ్య పార్వతిమానస సుతా ప్రభో
కరముతోన కరి శిరముతోన మమ్మే బ్రోవుము సదా ప్రభో తొలుత :
1చ : మహా శివునినే భక్త రావణుడు నిన్నే.. కొలువక గొనిపోగా ..
భక్తుడైన భగవంతుడైన ఆ .. నాకేమిటని అడ్డితివే తొలుత :
2చ : గిరినిబోలు ఉద్దండ పిండములు చేసేమాయను కనలేవా..
బొజ్జనిండ ఉండ్రాళ్ళు పెట్టిరని వారినివదలుట తగదు కదా.. తొలుత :
3చ : వ్యాసుడు చెప్పిన భారతమ్మునే.. భేషని వ్రాసిన గురుదేవా
అందుకె అయినది పంచమవేదము మహా ప్రసాదము మరచెదమా .. తొలుత :
ప : తొలుతను నిన్ను కొలిచేమయ్య పార్వతిమానస సుతా ప్రభో
కరముతోన కరి శిరముతోన మమ్మే బ్రోవుము సదా ప్రభో తొలుత :
1చ : మహా శివునినే భక్త రావణుడు నిన్నే.. కొలువక గొనిపోగా ..
భక్తుడైన భగవంతుడైన ఆ .. నాకేమిటని అడ్డితివే తొలుత :
2చ : గిరినిబోలు ఉద్దండ పిండములు చేసేమాయను కనలేవా..
బొజ్జనిండ ఉండ్రాళ్ళు పెట్టిరని వారినివదలుట తగదు కదా.. తొలుత :
3చ : వ్యాసుడు చెప్పిన భారతమ్మునే.. భేషని వ్రాసిన గురుదేవా
అందుకె అయినది పంచమవేదము మహా ప్రసాదము మరచెదమా .. తొలుత :
16, ఫిబ్రవరి 2015, సోమవారం
ఢమరుకం
ఢ మ ... ఢ మ
ఢ మ ... ఢ మ ....... ఢ మ రుకం
మ్రోగుతూ సాగుతోంది .. తాండవం ఢ మ:
ముని .. జన .. ఘన ప్రమధఘణ సేవితం
ఉమా సహిత పరమేశ్వర శోభితమ్ ఢ మ:
శిరసున గంగా తరంగమూగటం
శ శి కిరణం సోకి అది మెరవటం ఢ మ:
మూడు కనులు ముచ్చ టగా త్రిప్పటం
అది చూడాలని శిరస్సు త్రిప్పె పన్నగం ఢ మ:
ఆరుడుగుల అందమైన తాండవం
జగములనది ఊపుమీద ఊపటం ఢ మ:
ధిమి ..ధిమి ..ధిమి.. ధిమి .. కదలటం
మదిపుష్పమై శివచరణం చేరటం ఢ మ :
సు .త //
14, ఫిబ్రవరి 2015, శనివారం
కనకదుర్గమ్మ
కనకదుర్గమ్మ
ప : కొండను కొలువై వుందిరా
అదిగో మాతా శాంభవిరా
అండగ ఉండెదనందిర
భక్తుల పాలిటి అమ్మరా
మన శ్రీ కనకదుర్గమ్మరా కొండను:
1చ: సకలచరాచర మది చరిత
దుష్టులపాలిటి మృత్యులత
అగణిత గుణముల ప్రజ్వలత
శంకరి శుభకరి ఘనచరిత కొండను:
2చ : ఆశ్రితులను తన వారిగ ఎంచి
కొలచినకొలది కరుణించి
భక్తుల మొరలను ఆలించి
లోకాలను చల్లగ పాలించే కొండను:
3చ : విధాత తలపున విజ్ఞానం
శ్రీ హరి కే తరగని వైభోగం
పరమేశునిశక్తికె సగ భాగం
ఈ సృష్టికి అమ్మే కదమూలం కొండను:
ప : కొండను కొలువై వుందిరా
అదిగో మాతా శాంభవిరా
అండగ ఉండెదనందిర
భక్తుల పాలిటి అమ్మరా
మన శ్రీ కనకదుర్గమ్మరా కొండను:
1చ: సకలచరాచర మది చరిత
దుష్టులపాలిటి మృత్యులత
అగణిత గుణముల ప్రజ్వలత
శంకరి శుభకరి ఘనచరిత కొండను:
2చ : ఆశ్రితులను తన వారిగ ఎంచి
కొలచినకొలది కరుణించి
భక్తుల మొరలను ఆలించి
లోకాలను చల్లగ పాలించే కొండను:
3చ : విధాత తలపున విజ్ఞానం
శ్రీ హరి కే తరగని వైభోగం
పరమేశునిశక్తికె సగ భాగం
ఈ సృష్టికి అమ్మే కదమూలం కొండను:
7, ఫిబ్రవరి 2015, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)