కురిసింది అమృతము చిరు జల్లుగా
మురిసింది మానసము మహాజోరుగా
బీడు వారిన నేల వానధారల తడువ
ఉర్రూత లూగుతూ వేచి చూస్తుంటే కు :
గ్రీష్మ తాపముతోన దాహార్తులై
జన సమూహములన్ని గగ్గోలు పెడుతుంటె కు :
ఆ జల్లుకే మొలువ లేలేత పచ్చికలు
పచ్చనీ చీరనే కట్టుకున్నట్లు గా
పుడమి రమణీ విలాస సోయగం
చిత్రకారుని కందని మనోజ్ఞ దృశ్యమై కు :
చిరు గాలి సవ్వడుల తలయూచు వృక్షముల
నాట్యమ్ము చూస్తె , కోట్లాది మైఖల్సు శివమెత్తి ఆడినా
సరితూగునా, కోట్లు సరిపోవునా కు :
సరితూగునా, కోట్లు సరిపోవునా కు :
సు .త //
Very good
రిప్లయితొలగించండిCute...
రిప్లయితొలగించండిMurisindi manasu chadivi sukavtha....
రిప్లయితొలగించండిBeautiful...
రిప్లయితొలగించండి