31, జనవరి 2015, శనివారం
25, జనవరి 2015, ఆదివారం
ఆగష్టు 15
ఆగష్టున ఎగిరింది ఆ ఎత్తున జెండా
మరతుపాకి వెన్నుకాయ నిర్భీతిగ జెండా
స్వరాజ్యమ్ము వచ్చెనని స్వకేతనం ఎగురవేస్తే
ఏ రోజున ఎగిరింది ఈ వన్నెల జెండా
నిర్భయంగ నిక్కచ్చిగ తిరుగలేక జెండా
దీనికొక్క రంగు అంటు దానికొక్క రంగు అంటు
రంగులన్ని రంగరించి పూసుకొన్న జెండా
అర్థమంత మార్చివేసి అవహేళన చేస్తున్నా. .
తెలుపులోన శాంతిలేక , ఎరుపు విలువ తెలియలేక
కాలుష్యపు కోరలోన పచ్చదనము కానలేక
కన్నీరుగ మున్నీరుగ విలపిస్తూ విహంగమై
విశృంఖల మానవాళి అకృత్యము కానలేక
ఉవ్వెత్తున ఎగురుతోంది మువ్వన్నెల జెండా
ఎగరలేక ఎగరలేక ఎగురుతోంది చూడు నేడు
విశే షించి ప్రకాశంగ వినువీధిన జెండా
సు.త /
23, జనవరి 2015, శుక్రవారం
ఎక్కడ
ఎక్కడ , ఎక్కడ . ఎక్కడ
కనబడడే మనిషెక్కడ
కూడు గుడ్డ గూడు లేని
రోజులనుంచి పరిగెడుతూ
ఎన్నోనేర్చి ఎన్నోచేసి
జగతినినేనే ఘనుడంటూ
అదిగో మృగమని
ఒకనాడంటూ
ఇదిగో మృగమని
తనలో చూస్తూ (ఈనాడు )
ఎదిగాడా
దిగాజారాడా
చక్కని బంగరు పాపలను
తనువిచ్చిన చల్లని తల్లులను
కావగలేని
ఈలోకంలో
ఎక్కడ, ఎక్కడ ,ఎక్కడ
కనబడడే మనిషెక్కడ
దూసుకుపోతాం ఆకాశంలో
ఎన్నోకడతాం భూలోకంలో
కబుర్లు చెబుతాం మీటింగుల్లో
కాలేకదపం కార్యరంగంలో
ఎదిగే కొద్దీ ఒంగద్దు
తలదించుకొనేలా బ్రతకొద్దు
ఎత్తు ఎత్తు తల పైకెత్తు
మంచిగ ఉంటూ గర్వించు
నీఉపకారం ఎవరికివద్దు
నీఅపకారం చేయకుముందు
తోటివారిని జీవించేలా
నీవుంటేనే జగతికి నిండు
సు .మ /
15, జనవరి 2015, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)