ఆగష్టున ఎగిరింది ఆ ఎత్తున జెండా
మరతుపాకి వెన్నుకాయ నిర్భీతిగ జెండా
స్వరాజ్యమ్ము వచ్చెనని స్వకేతనం ఎగురవేస్తే
ఏ రోజున ఎగిరింది ఈ వన్నెల జెండా
నిర్భయంగ నిక్కచ్చిగ తిరుగలేక జెండా
దీనికొక్క రంగు అంటు దానికొక్క రంగు అంటు
రంగులన్ని రంగరించి పూసుకొన్న జెండా
అర్థమంత మార్చివేసి అవహేళన చేస్తున్నా. .
తెలుపులోన శాంతిలేక , ఎరుపు విలువ తెలియలేక
కాలుష్యపు కోరలోన పచ్చదనము కానలేక
కన్నీరుగ మున్నీరుగ విలపిస్తూ విహంగమై
విశృంఖల మానవాళి అకృత్యము కానలేక
ఉవ్వెత్తున ఎగురుతోంది మువ్వన్నెల జెండా
ఎగరలేక ఎగరలేక ఎగురుతోంది చూడు నేడు
విశే షించి ప్రకాశంగ వినువీధిన జెండా
సు.త /
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి