ఎవరిని జయించాలి
అది సత్యం మాష్టారి ఇల్లు
సత్యం మాష్టారు : ఆ ... లెక్క అర్ధమయింది కదా
జాగ్రత్త గా వ్రాసుకోండి
పిల్లలు : అలాగే మాష్టారు
సం. మా : ఏ మోయ్ సరస్వతి ఓ గ్లాసెడు మంచి నీళ్ళు తీసుకురా .
సరస్వతి ( లోపలనుంచి ): ఆ ... వస్తున్నా
స. మా : ఏరా రవి నీవు వ్రాయటం లేదే
రవి : నా పెన్ను కనిపించటం లేదు మాష్టారు
స . మా : ఏరా అసలునీవు తెచ్చావా
ర : తెచ్చాను మాస్టారు
స . మా : అందరూ వెదకండి
పి : లేదు మాష్టారు
స . మా : అయితే ఎవరో దొంగిలించారన్న మాట
(పిల్లలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు )
స . మా : చూడండి పిల్లలూ మనం ఏది ఊరికే రావాలని కోరుకోకూడదు.
కష్టపడి సంపాదించాలి . అపుడే దానికి విలువా గౌరవం ఉంటాయి .
ఉదాహరణకు మనకు ఒక వంద రూపాయలు దొరికాయనుకోండి ,
మనందానిని ఏం చేస్తాం , ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా ఖర్చు పెడతాం .
అంటే , సినిమాకు, చాక్లెట్లకు వాటికి వీటికి అన్నిటికి .
పి : అవునండి
స . మా : పైగా జలసాలకు అలవాటు పడతాం . దొంగతనాలు కూడా చేస్తాం . చివరకు అందరూ అసహ్యించుకుంటారు .
పి : అమ్మో
స . మా : అదే ఒక రూపాయి కష్టపడి సంపాదించా మనుకోండి
అలా ఖర్చు పెట్టగలమా .
పి : అమ్మో
స . మా : అది అందుచేత పెన్ను ఇచ్చే ఆనందం కన్నా దొంగ అనే బాధ బాధిస్తుంది .
రాము : సారీ మాష్టారు (ఏడుస్తూ )
స . మా : గుడ్ ఏడవకు , తప్పు తెలుసుకుని మానేయటం గొప్ప . ఇంకెప్పుడు ఇలా చేయకు .
సరస్వతి : ఇవిగోండి నీళ్ళు
స . మా : అప్పుడెప్పుడో చెపితే ఇపుడు పనిచేసిందేమిటే బుర్ర
ఈ లోపల నాపాటం కూడా అయ్యింది .
సరస్వతి : బాగుంది మీకంటే పాటాలు మంచి నీళ్ళ ప్రాయం
ఆ మంచి నీళ్ళే నా ప్రాణం తోడే స్తున్నాయి . ఎక్కడనుంచో తేవాలి
దొడ్లో పంపు వేయించమంటే వేయించరు .
స . మా : సర్లే . . . సర్లే నోరు విప్పితే మాటలు తూటాల్లా వదులుతావు
నేనే మన్నా అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నానా . అది వేయించాలంటే ఎంత ఖర్చు .
సరస్వతి : అది సరేగాని పాటాలు చెప్పక ఈ నీతి కబుర్లేమిటి
స . మా : చూడు నీకు ఈ పేరు ఎందుకు పెట్టారో గాని ఒక్క క్లాసు కూడా చదవలేదు .
విలువలు లేని చదువులు వలువలు లేని మనుషుల తో సమానం .
సరస్వతి : సర్లెండి అవేవో వాళ్లకు చెప్పుకోండి . నాకు ఇంట్లో పనుంది .
---------------------------------------
( మాస్టారు పేపరు చదువుతూ వుంటారు )
స. మా : కార్గిల్లో భీకరయుద్దం . టైగర్ హిల్ల్స్ స్వాధీనం . 21 మంది పాకిస్తానీయుల హతం . 6గురు మన వారు వీర స్వర్గం .
ఏమిటో ఈ గొడవలు ఎప్పుడు ఆగుతాయో
భరతమాత ఎప్పుడు ప్రశాంతం గా ఉంటుందో .
బంట్రోతు : మాస్టారు , శంకరం మాష్టారు ఈ కాగితాలు మీకిమ్మన్నారు .
స . మా : ఇలా ఇయ్యి
బంట్రోతు : మాస్టారు ఇందాకటినుంచి చూస్తున్నాను . అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతోంటే మీరంత బాధపడి పోతారెందుకు .
స . మా : ఎంత మాటన్నావురా , నీ శరీరం లో ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలితే మొత్తం శరీరం దాని గురించే బాధ పడుతూ ఎందుకు ఆలోచిస్తుంది .
బంట్రోతు : ఎందు కంటే ఎక్కడ తగిలినా మనసరీరం లోనే కదా . అందుచేత బాధ మనకు కాకపొతే ఎవరికి
ఉంటుందండి .
స . మా : అలాగే అక్కడ దాని గురించి మనం పట్టించు కో పొతే అది ఇక్కడదాకా వ్యాపిస్తుంది
అప్పుడు ఎవరురా అనుభవించేది .
బంట్రోతు : అబ్బా నిజమేనండి నేను మనిషి ఎదిగానండి కాని బుర్ర ఎదగలేదండి
స . మా : దురదృష్ట వశాత్తు మన దేశం లో అదే కరువౌతోంది . ప్రక్కన ఏం జరిగినా పట్టించుకోకపోవడం , మనదాకావస్తే బావురుమనటం . ఆ స్వాతంత్ర సమరంలో ఎంతటి దేశ భక్తీ , ఎంతటి త్యాగనిరతీ అవన్నీ ఇపుడు మచ్చుకైనా కనిపించట్లేదు .
బంట్రోతు : నిజమేనండి ఇంత చిన్న చిన్న వాళ్ళు అలా ప్రాణా లర్పిస్తోంటే గుండె తరుక్కు పోతోందండి .
అక్బర్ : నమస్కారం మాష్టారు
స . మా : ఎవరూ
అ : నేను మాష్టారు , మీ ఇంట్లో ఉంచు కొని 10వ తరగతి దాకా చదివించారూ ,
స . మా : ఆ ..ఆ .. నువ్వా అక్బర్ ఏం చేస్తున్నావు
అ : పోలీసు డిపార్టుమెంటు లో S . I . . గా చేస్తున్నాను మాస్టారూ
స . మా : బావుందోయ్
అ : మీ మతం కాదని కూడా చూడకుండా నన్ను ఆదరించారు మాష్టారు . మీ చలవ లేకపోతె
ఇంత వాణ్ణయే వాణ్ణి కాను .
స . మా : అక్బరూ మతం కాదు ము ఖ్యం
మమతేరా న్యాయం
కాదా ఇది సత్యం
వినకపోతే వినాశనం
బంట్రోతు : అది నిజమండి ఎవరైతే ఏంటి అందరు సమానమే
అ : ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి
స . మా : చదువు అయ్యింది ఏదో ఉద్యోగం చేస్తున్నాడు
అ : స్కూల్లో చెప్పీది సరిపోతుంది కదండీ ఇంకా కష్టపడటం ఎందుకు మాష్టారు
స . మా : విజ్ఞానం తెలుసుకోడానికి ఎంత టైంఅయితే సరిపోతుం ది రా
నా విద్యార్ధులకు నాకు తెలిసినది నిరంతరం చెప్పా లన్నదే నా తపన
అ : మీలాంటి వారు ఉండరు మాష్టారు
ఇక ఉంటాను పనుంది మాష్టారు
స . మా : అప్పుడే
అ : ఒక క్రిమినల్ ను పట్టుకున్నాము ఇక్కడ
స . మా : ఇక్కడా , ఉండు నేనూ వచ్చి చూస్తాను
అ : మీరా ఎందుకులెండీ
స . మా : పరవాలేదయ్యా
అ : అతనో క్రిమినల్ మాష్టారు R.D.X తో పట్టుకున్నాము
స . మా : ఎవరూ . . . విశ్వం . . .
అ : చెపితే బాధ పడతారని చెప్పలేదు మాష్టారు
స . మా : నా కడుపున చెడ పుట్టావురా
విశ్వం : నాన్నా
స . మా : ఎందుకురా నీకీపని
వి : వాళ్ళు చాలా డబ్బిస్తా మన్నారు , చెయ్యకపోతే చంపేస్తామన్నారు
స . మా : ఛీ . . . ఎదురునిలిచి పోరాడే శ త్రువుకన్నా నీలాంటి వాళ్ళు రా దేశానికి అసలైన శత్రువులు ...
నీచుడా
అ : మాష్టారు
స . మా : అవునయ్యా . . . మనం జయించాల్సింది బయటి శత్రువుల్ని కాదయ్యా అంతః శ త్రువుల్ని
ఆశ , మొహం , భయం, . . . వీటిని జయించాలి .
మనం సరిగా ఉంటే ఎవరయ్యా వచ్చేది , ఏం చేస్తారయ్యా మనల్ని . . ఆ
వి : నాన్నా తప్పయింది నాన్నా
స . మా : చదువుకాదు రా కావలసింది సంస్కారం రా
బతుకుతామన్నది కాదు ఎలా బతుకుతున్నామన్నది ముఖ్యం
ఛీ . . . నీ మొహం నాకు చూపించకు .
అ : విశ్వానికి శి క్ష తక్కువ పడేలా చూస్తాను మాష్టారు
స మా : నో . . . (చెంపదెబ్బ ) . . . ఈ గాలి , ఈ స్వేచ్చ , అనుభవిస్తూ ఈ దేశం లో జీవిస్తూ విశ్వాసం లేకుండా ఇంత పని చేస్తాడా నీచుడు . నో . . . తప్పు చేసినవాడె వడైనా శి క్ష అనుభవించాల్సిందే
ఫో . . . తీసుకు ఫో తక్ష్క్ష ణ మ్
అ ; మాష్టారు .. మాష్టారూ
స మా : నావాళ్ళు ఇలా అయ్యారేమిటి
ఈ దేశానికి కావలసినది వీరులే కాదు
నీతి , నిజాయితీ కలిగిన అధి కా రులూ , ప్రజలూ కూడా
( గుండెపోటుతో మరణిం చాడు )
మాష్టారూ , మాష్టారూ ... మాష్టారూ . . .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి