నో (టి )టు దెబ్బ
నల్ల ధనాన్ని నగ్నంగా నిలబెడతానని ,అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది అన్నట్లుగా ఒక రాత్రి మోడీ మూడొ ఛ్చి అప్పటికప్పుడు నోట్ల రద్దు నిర్ణయo
తీసుకుంటె అప్పుడు మొదలయ్యాయి దేశానికి కష్టాలు ,నష్టాలు . ఇలాఅంటే
కాదు కాదు ఈ కష్టాలు తొందరలో తీరి ఈ సేవలు అందు బాటులోకొఛ్చి సుఖ పడే అద్భుత సమయం ముందుంది అంటూ అదిరేటి ఉపన్యాసాలు దంచేస్తున్నారు బాబులతో సహా . ఇక నాయకులు ఈపని తప్పు అనరు
ఎక్కడ బయటపడిపోతామో అని, విధానం తప్పు అంటారు ,కానీ ఎలా చేయాలో చెప్పరు . అంతా గందరగోళం . ఇక ఏదో టెక్నాలజీ వచ్చేస్తోందంటారు , ఉన్న టెక్నాలజీని (ఏ.ట్.ఎం) మూలాన పడేసారు.
ఒక్క సామాన్యుడు తప్ప పెద్ద వాళ్ళెవరైనా క్యూలో రోడ్డెక్కారా . కారణం
వాళ్లకు కోట్లకు కోట్లు అందుతున్నాయి . ప్రధానమంత్రి నోట్లు రద్దు చేసినప్పుడు, నోటు హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వటానికి వీల్లేదు
ఇస్తే ఉద్యోగాలు ఊడతాయి అన్నీ ఏ.టి.ఎం లో పెట్టండి అని ఎందుకు
అనలేదు . అందరూ మేధావులే కదా . నల్లకుబేరులను,బ్యాంకు వాళ్ళను
కుమ్మక్కవండి జాగ్రత్తగా దో చుకోండి అని అవకాశం ఇచ్చారా . నోట్లు
ఏ.టి.ఎం లలో పెట్టి ఉంటే జనాలకి ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవా .
నోట్లు అయిపోతాయంటారా ఇపుడు బ్యాంకులలో అవ్వట్లేదా .
సిబ్బంది కడు ఇబ్బంది అన్నట్లుగా , సిబ్బందిని కంట్రోల్లో
పెట్టలేనప్పుడు, సరిగా ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు విధానాలను రూపొందిo చకూడదు . దేశాన్ని అస్తవ్యస్తం చేయకూడదు . ఆన్ లైన్
ఆపరేషన్ జనాలకి ఒక సంవత్సరం క్రితం నుంచి అలవాటు చేసుంటే , నోట్లు రద్దు చేసినా ఏ.టి.ఎంలు ఆగకుండా చూసుంటే ఇంత గందరగోళం
ఏర్పడేదా . కానీ ఇప్పుడేమవుతోంది
పెద్దవాళ్ళ నల్ల ధనం అయ్యింది తెల్లధనం
సామాన్యుడి దగ్గరనుంచి పోయింది మూలధనం
సుత//