12, డిసెంబర్ 2016, సోమవారం

నో (టి )టు దెబ్బ

                                                               నో (టి )టు దెబ్బ 
నల్ల ధనాన్ని నగ్నంగా నిలబెడతానని ,అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది అన్నట్లుగా  ఒక రాత్రి మోడీ మూడొ ఛ్చి అప్పటికప్పుడు నోట్ల రద్దు నిర్ణయo 
తీసుకుంటె అప్పుడు మొదలయ్యాయి దేశానికి కష్టాలు ,నష్టాలు .  ఇలాఅంటే 
కాదు కాదు ఈ కష్టాలు తొందరలో తీరి సేవలు అందు బాటులోకొఛ్చి సుఖ పడే అద్భుత సమయం ముందుంది అంటూ అదిరేటి ఉపన్యాసాలు దంచేస్తున్నారు బాబులతో సహా . ఇక నాయకులు ఈపని తప్పు అనరు 
ఎక్కడ బయటపడిపోతామో అని, విధానం తప్పు అంటారు ,కానీ ఎలా చేయాలో చెప్పరు . అంతా గందరగోళం .    ఇక  ఏదో  టెక్నాలజీ వచ్చేస్తోందంటారు , ఉన్న టెక్నాలజీని (ఏ.ట్.ఎం) మూలాన పడేసారు. 
ఒక్క సామాన్యుడు తప్ప పెద్ద  వాళ్ళెవరైనా  క్యూలో రోడ్డెక్కారా .  కారణం 
వాళ్లకు కోట్లకు కోట్లు అందుతున్నాయి .   ప్రధానమంత్రి  నోట్లు రద్దు చేసినప్పుడు,   నోటు  హ్యాండ్  టు  హ్యాండ్   ఇవ్వటానికి   వీల్లేదు 
ఇస్తే  ఉద్యోగాలు  ఊడతాయి  అన్నీ ఏ.టి.ఎం  లో  పెట్టండి  అని  ఎందుకు 
అనలేదు . అందరూ మేధావులే కదా .   నల్లకుబేరులను,బ్యాంకు వాళ్ళను 
కుమ్మక్కవండి  జాగ్రత్తగా  దో చుకోండి  అని  అవకాశం ఇచ్చారా .  నోట్లు 
ఏ.టి.ఎం లలో పెట్టి ఉంటే జనాలకి ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవా . 
    నోట్లు  అయిపోతాయంటారా  ఇపుడు  బ్యాంకులలో అవ్వట్లేదా . 
సిబ్బంది  కడు ఇబ్బంది  అన్నట్లుగా ,    సిబ్బందిని    కంట్రోల్లో
పెట్టలేనప్పుడు,  సరిగా  ఇంప్లిమెంట్  చేయలేనప్పుడు విధానాలను రూపొందిo చకూడదు . దేశాన్ని  అస్తవ్యస్తం   చేయకూడదు . ఆన్ లైన్ 
ఆపరేషన్ జనాలకి ఒక సంవత్సరం క్రితం  నుంచి అలవాటు చేసుంటే ,   నోట్లు రద్దు చేసినా  ఏ.టి.ఎంలు  ఆగకుండా చూసుంటే ఇంత గందరగోళం 
ఏర్పడేదా . కానీ ఇప్పుడేమవుతోంది 

   పెద్దవాళ్ళ    నల్ల  ధనం  అయ్యింది   తెల్లధనం 
  సామాన్యుడి  దగ్గరనుంచి  పోయింది    మూలధనం  




                                                                             సుత//

























1 కామెంట్‌: