నూతన సంవత్సర శుభాకాంక్షలు
యుగం అది కాలానికి కొలమానం కావచ్చుఁ
కానీ మనిషిని బట్టి మారే విచిత్ర చిత్రం
ఆత్మీయత కోరు క్క్షణం కాదా ఒక యుగం
మనసు మనసు కలసినచో యుగమే ఓ క్క్షణం
చరిత్రలో ప్రతీ క్క్షణం అనుభవాలమయం
రాబోయే కాలానికి అదే కదా బలం
చేదు చూపి చాచి కొట్టి గతమంతా కదలినా
చిరు ఆశల కల తప్పదు కదిలే ఈ సృష్టి లో
సాధకులకు ప్రతీ క్క్షణం అమూల్యమైన వరం
సోమరులకు రేపుకూడ చాలదన్న భయం
తృప్తి తోన జీవిస్తే కనీస మొక్క క్క్షణం
మన జీవిత సమరం లో అదే గొప్ప క్క్షణం
సు త //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి