అదో మహాసంగ్రామం
కాని అక్కడ శతఘ్నులు ,శ తాధికసైన్యం
సైనికుల కదలికలు ఉండవు
కాని మాటలు తూటాల్లా పేలతాయి
గుండెల్లో గునపాలు గుచ్చు కుంటాయి
రుధిరం కారదు ,కాని శ త్రువులు ఆగరు
ఇగోతో వీరవిహారం
మౌనంగా పోరాటం
ఇండియా పాకిస్తాన్ గొడవల్లా ఇవి ఆగవు
అలాగని సమస్యలు తీరవు
నిరంతర ఆరాటం
విడి పోలేని పోరాటం
నెగ్గే వాళ్ళు ఆపరు
ఓ డే వాళ్ళు ఓ డరు
ఇదొక విచిత్ర సంగ్రామం
కత్తుల్లేని స్వైరవిహారం
నిరంతర జీవన పోరాటం
ఇది కూడా మహాసంగ్రామమే
సంసారం
సు.త //
Very real antuleni poratam
రిప్లయితొలగించండిChala bagundi sir....hats off to your thinking
రిప్లయితొలగించండి