ప : కైలాసవాసా. . శివశంకరా
శంభోహరా. . హర గంగాధరా. .
కరుణాంతరంగా. . మముకావరా
పూజింతుము నిను పరమేశ్వరా. . కైలాస :
1చ : అలనాడు గరళము త్రాగావుట
లోకాలను రక్షిo చావుటా
కాలునిఅడ్డి బాలుని బ్రోచి
చిరంజీవిగా చేసావుటా కైలాస :
2చ: ఆది బిక్షువు నీ వై నా
అందరికీ నిధి నీవే న టా
నిరతము ధ్యానం లో వున్నా
జగతిని చల్లగ చూ సే న ట
ఈ జగతిని చల్లగ చూ సే న ట కైలాస :
3చ: సరసన గౌరీ సగమైనది
శిరసే గంగా నెలవైనది
ఒడిలో కొమరుల జంటున్నది
ఎదురుగ నందీ వేచున్నది కైలాస :
చాలా బాగుంది ఓం నమఃశివాయ.
రిప్లయితొలగించండి