16, నవంబర్ 2014, ఆదివారం
శిశోదయం
శిశోదయం
చుట్టూతా . . . హడావుడి
కడుపులో ఆకలి దంచేస్తోంది
ఏడుపు . . ఆగట్లేదు
అపుడే . . ఓ చేయి నన్ను నిమిరింది
నా నోటికి అమృతభాండాన్ని అందించింది
అబ్బ. . నా కడుపు నిండింది . .
అపుడు చూడటం మొదలుపెట్టాను . . ఆ దేవతని
బొజ్జ నిండిందా నా కన్నా అంది . . మా అమ్మ . . ఓ ముద్దెట్టి
ఈ లోపల ఎవరో . . నాకేసి చూపించింది. . సిగ్గుపడుతూ
అపుడు నాకు ఇంకో ముద్దు . . . వెంటనే మా అమ్మకు ,
అపుడంది అమ్మ . . నాన్నరా అని
ఇపుడు నా కడుపే కాదు . . మనసు కూడా నిండింది
ఆనందంగా
అపుడంది అమ్మ . . నాన్నరా అని
ఇపుడు నా కడుపే కాదు . . మనసు కూడా నిండింది
ఆనందంగా
అమ్మ ప్రేమ అమరామరం.
రిప్లయితొలగించండి