కోయిలమ్మలు గొంతు సవరించుకొను వేళ
విరుగబూసిన కలువ సోలిపోయేవేళ
నదులు గలగల చేసి పరవశించే వేళ
చెంగు చెంగున ఎగురు లేగలను చూసి
గోమాత ప్రేమతో పాలు కుడిపేవేళ
కలల కౌగిలవీడి కాంత వాకిలి చేరి
అలసిసొలసిన మేను ఒక సారి విదిలించె
కవుల కావ్య కల్పనకు అందని చిత్ర జగత్తువలె
ఇంత ముగ్ద మనోహరమో ప్రకృతి కాంత చూడ
ఆలసించిన పోవు ఆనంద సమయమని
ఉదయాద్రి పై నుండి ఉరికె రవి తేజంబు .
సు . త /
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి