ఎటు చూసిన ఆనందం ఎద పొంగిన ఉత్సాహం
మదికోరెను విన్నూత్నం మరుపాయెను క్షణకాలమ్
చిందించెను మందంతా మగవారలు రాత్రంతా
చేసితివన ఘనకార్యం ఆపితివన చెడు కాలం
వస్తుండెను పోతుండెను యుగమన్నది బరువాయెను
మనిషిలోని మనసంతా ఎండమావితీరాయెను
కాంతివేగమింతేయని అంతకన్న వేగమనుచు
అరుణారుణ కాంతులన్ని అందించెను శక్తి అనుచు
ఎంత పురోగతిని నీవు సాధించిన ఏమాయెను
సాటిమనిషి బాగోగులు వీసమైన చూడ లేవు
ఏమైనా ఓ నేస్తం , రాబోయే కాలానికి
మనిషి విలువ పెంచుకుంటు మనసుతోన నడుచుకుంటు
సుస్వాగత గీతమ్మును కలసిమనం పాడుదాం .
సు.త /